ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకేనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥ 44
ఉత్సన్న కులధర్మాణామ్, మనుష్యాణామ్, జనార్దన,
నరకే, నియతమ్, వాసః, భవతి, ఇతి, అనుశుశ్రుమ
జనార్దన = కృష్ణా; ఉత్సన్న కులధర్మాణామ్ = వినష్ట కులధర్ములైన; మనుష్యాణామ్ = మానవులకు, నియతమ్ = తప్పనిదై; నరకే = నరకంలో; వాసః = వాసం; భవతి = కలుగుతుంది; ఇతి = అని; అనుశుశ్రుమ = గురుశిష్య పరంపరగా వింటున్నాము.
తా ॥ జనార్దనా! ‘కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు’ – ఇది మనం ఆచార్య పరంపరాక్రమంలో విన్న విషయం.