దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ।
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥ 43
ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన ।
నరకేనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ ॥ 44
దోషైః, ఏతైః, కులఘ్నానామ్, వర్ణసంకరకారకైః,
ఉత్సాద్యంతే, జాతిధర్మాః, కులధర్మాః, చ, శాశ్వతాః.
ఉత్సన్న కులధర్మాణామ్, మనుష్యాణామ్, జనార్దన,
నరకే, నియతమ్, వాసః, భవతి, ఇతి, అనుశుశ్రుమ
ఏతైః = ఈ; వర్ణసంకర కారకైః = వర్ణ సంకర కారకాలైన; దోషైః = దోషాల చేత; కులఘ్నానామ్ = కులఘాతకుల; శాశ్వతాః = సనాతనములైన; జాతి ధర్మాః = వర్ణధర్మాలు; కులధర్మాః చ = కుల ధర్మాలను; ఉత్సాద్యంతే = ఉత్సన్నములు, సమూలముగ నశించినవి అవుతున్నాయి. జనార్దన = కృష్ణా; ఉత్సన్న కులధర్మాణామ్ = వినష్ట కులధర్ములైన; మనుష్యాణామ్ = మానవులకు, నియతమ్ = తప్పనిదై; నరకే = నరకంలో; వాసః = వాసం; భవతి = కలుగుతుంది; ఇతి = అని; అనుశుశ్రుమ = గురుశిష్య పరంపరగా వింటున్నాము.
తా ॥ వర్ణసంకర కారణాలైన ఈ దోషాల వల్ల, కులఘాతకుల వల్ల సనాతన వర్ణధర్మాలు, కులధర్మాలు , ఆశ్రమధర్మాలు, ఉత్సన్నమవుతున్నాయి. (సమూలంగా నశించినవి అవుతున్నాయి)
తా ॥ జనార్దనా! ‘కులధర్మ భ్రష్టులు తప్పక నరకంలో నివసిస్తారు’ – ఇది మనం ఆచార్య పరంపరాక్రమంలో విన్న విషయం.