సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ । 
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః ॥ 42 
సంకరః, నరకాయ, ఏవ, కులఘ్నానామ్, కులస్య, చ, 
పతంతి, పితరః, హి, ఏషామ్, లుప్త పిండ ఉదక క్రియాః. 
సంకరః = సంకరం; కులఘ్నానాం = కుల ఘాతకులకు; కులస్యచ = కులమంతటికి; నరకాయ ఏవ = నరకకారణమే అగును; హి = ఏలనగా; ఏషాం చ = వీరి; పితరః = పితృపురుషులు కూడా; లుప్త పిండ ఉదక క్రియాః = పిండదాన, తర్పణక్రియలు లేనివారై; పతంతి = నరకంలో పడతారు.
తా ॥ వర్ణసంకరమైతే కులఘాతకులు, కుల జనులంతా కూడా నరకంలో పడవేయబడుతున్నారు; శ్రాద్ధతర్పణ క్రియలు (పిండదానమొనర్చే అధికారులు లేక పోవడం చేత) లోపించడం వల్ల వారి పితృపురుషులు కూడా నరకంలో పడుతున్నారు.