అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః ।
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః ॥ 41
అధర్మాభిభవాత్, కృష్ణ, ప్రదుష్యంతి, కులస్త్రియః,
స్త్రీషు, దుష్టాసు, వార్ష్ణేయ, జాయతే, వర్ణసంకరః.
కృష్ణ = కృష్ణా; అధర్మ అభిభవాత్ =అధర్మాక్రమణం వల్ల; కులస్త్రియః = కుల స్త్రీలు; ప్రదుష్యంతి = చెడిపోవుదురు; స్త్రీషు = ఆడవారు; దుష్టాసు = చెడిపోవ; వార్ష్ణేయ = కృష్ణా; వర్ణసంకరః = వర్ణ సంకరం; జాయతే = కలుగుతుంది.
తా ॥ కృష్ణా! అధర్మాక్రమణం వల్ల కులస్త్రీలు వినష్టలవుతారు; ఓ వృష్ణికుల సంభవా! కులస్త్రీలు చెడిపోతే వర్ణసంకరం* అవుతుంది.