కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోఽభిభవత్యుత ॥ 40
కులక్షయే, ప్రణశ్యంతి, కులధర్మాః, సనాతనాః,
ధర్మే, నష్టే, కులమ్, కృత్స్నమ్, అధర్మః, అభిభవతి, ఉత.
కులక్షయే = కులనాశనం వల్ల; సనాతనాః = శాశ్వతములైన; కుల ధర్మాః = కుల ధర్మాలు; ప్రణశ్యంతి = నశిస్తాయి; ఉత = మరియు; ధర్మే = ధర్మము; నష్టే = నశించగా; అధర్మః = అధర్మం; కులమ్ = వంశం; కృత్స్నమ్ = అంతటిని; అభిభవతి = వశ మొనర్చుకొనును.
తా ॥ కులనాశనం వల్ల సనాతనమైన కులధర్మాలు వినష్టమవుతాయి; ధర్మం నశిస్తే, కులమంతా అనాచార మయమయ్యే అధర్మంతో కప్పబడిపోతుంది.