నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన ।
పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతానాతతాయినః ॥ 36
నిహత్య, ధార్తరాష్ట్రాన్, నః, కా, ప్రీతిః, స్యాత్, జనార్దన,
పాపమ్, ఏవ, ఆశ్రయేత్, అస్మాన్, హత్వా, ఏతాన్, ఆతతాయినః.
జనార్దన = కృష్ణా; ధార్తరాష్ట్రాన్ = దుర్యోధనాదులను; నిహత్య = చంపి; నః = మనకు; కా = ఏమి; ప్రీతి = సంతోషం; స్యాత్ = లభిస్తుంది; ఏతాన్ = ఈ; ఆతతాయినః = హననోద్యుక్తులను; హత్వా = చంపితే; అస్మాన్ = మనకు; పాపమ్ ఏవ = పాపమే ఆశ్రయేత్ = చుట్టుకుంటుంది.
తా ॥ జనార్దనా! దుర్యోధనాదులను చంపడం వల్ల మనకు కలిగే సంతోషం ఏమిటి? ఈ ఆతతాయుల* నందరిని చంపడం* వల్ల మనకు లభించేది పాపమే!