ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతోఽపి మధుసూదన ।
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే ॥ 35
ఏతాన్, న, హంతుమ్, ఇచ్ఛామి, ఘ్నతః, అపి, మధుసూదన,
అపి, త్రైలోక్యరాజ్యస్య, హేతోః, కిమ్, ను, మహీకృతే.
మధుసూదన = కృష్ణా; ఘ్నతః అపి = (నన్ను) చంపుచున్న వారి నైనను; ఏతాన్ = వీరిని; త్రైలోక్యరాజ్యస్య = త్రిలోకాధిపత్యపు; హేతోః అపి = నిమిత్తమైనా; హంతుమ్ = వధింప; న ఇచ్ఛామి = కోరను; మహీకృతే = భూలోక రాజ్యం కొరకు; కిం ను = ఇక చెప్పవలెనా?
తా ॥ (నీవు వీరిని చంపకపోయినా, వీరు నిన్ను వధిస్తారు, కనుక వీరిని వధించి రాజ్యాన్ని భోగించమని అంటావా 🙂 ఓ మధుసూదనా!* నన్ను వీరు వధించినా, నాకు వీరిని చంప ఇష్టం లేదు. పృథ్వి మాటేమి, త్రిలోకరాజ్యాన్ని పొందడానికైనా కూడా వీరిని చంపను.