కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ॥ 32
యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ ॥ 33
ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః ।
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ॥ 34
కిమ్, నః, రాజ్యేన, గోవింద, కిమ్, భోగైః, జీవితేన, వా.
యేషామ్, అర్థే, కాంక్షితమ్, నః, రాజ్యమ్, భోగాః, సుఖాని, చ,
తే, ఇమే, అవస్థితాః, యుద్ధే, ప్రాణాన్, త్యక్త్వా, ధనాని, చ.
ఆచార్యాః, పితరః, పుత్రాః, తథా, ఏవ, చ, పితామహాః,
మాతులాః, శ్వశురాః, పౌత్రాః, శ్యాలాః, సంబంధినః, తథా.
గోవింద = కృష్ణా; నః = మనకు; రాజ్యేన = రాజ్యంతో; కిం = ఏం ప్రయోజనం; భోగైః = భోగాలతో; జీవితేన వా = జీవితాలతోను; కిం = ఏం ప్రయోజనం; భోగైః = భోగాలతో; జీవితేన వా = జీవితాలతోను; కిం = ఏం ప్రయోజనం; యేషామ్ అర్థే = ఎవరి కొరకు; నః = మనకు; రాజ్యమ్ = రాజ్యాన్ని; భోగాః = భోగాలను; సుఖాని చ = సుఖాలను; కాంక్షితం = కోరబడినదో; తే ఇమే = ఆ ఈ; ఆచార్యాః = ఆచార్యులు; పితరః = తండ్రులు; పుత్రాః = పుత్రులు; తథా చ = అదే విధంగా, పితామహాః ఏవ = పితామహులు; మాతులాః = మేనమామలు; శ్వశురాః = మామలు; పౌత్రాః = మనుమలు; శ్యాలాః = బావమరుదులు; తథా = మఱియు; సంబంధినః = బంధువులు; ప్రాణాన్ = ప్రాణాలను; ధనాని చ = సంపదలను; త్యక్త్వా = వదలి; యుద్ధే = రణభూమిలో; అవస్థితాః = నిలిచి ఉన్నారు.
తా ॥ గోవిందా!* మనకు రాజ్యంతోగాని, సుఖభోగాలతో గాని, జీవితంతో గాని ప్రయోజనమేముంది? ఎందుకంటే, ఎవరి కోసం మనం రాజ్యాన్ని, భోగాలను సుఖాలను ఆకాంక్షిస్తున్నామో; ఆ గురువులు, తండ్రులు, పుత్రులు, పితామహులు, మేనమామలు, మామలు, మనుమలు, బావలు, ఇతర బంధువులు ధనప్రాణాలపై ఆశను వదలి ఈ యుద్ధానికి వచ్చారు.