అర్జున ఉవాచ :
దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ ॥ 28
సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి ।
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే ॥ 29
గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే ।
దృష్ట్వా, ఇమం, స్వజనం, కృష్ణ, యుయుత్సుం, సముపస్థితం
సీదంతి, మమ, గాత్రాణి, ముఖమ్, చ, పరిశుష్యతి
వేపథుః, చ, శరీరే, మే, రోమహర్షః, చ, జాయతే,
గాండీవమ్, స్రంసతే, హస్తాత్, త్వక్, చ, ఏవ, పరిదహ్యతే
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; కృష్ణ = శ్రీకృష్ణా; సముపస్థితం = చేరి ఉన్న; యుయుత్సుం = యుద్ధాభిలాషులైన; ఇమం = ఈ; స్వజనం = బంధువులను; దృష్ట్వా = చూసి; మమ = నా; గాత్రాణి = సర్వాంగాలు; సీదంతి = పట్టు తప్పిపోతున్నాయి; ముఖం చ = నోరు కూడా; పరిశుష్యతి = ఎండిపోతున్నది; మే శరీరే = నా దేహంలో; వేపథుః చ = కంపమును; రోమహర్షః చ = గుగుర్పాటును; జాయతే =కలుగుతున్నాయి; హస్తాత్ = చేతి నుండి; గాండీవః = గాండీవ ధనువు; స్రంసతే = జారిపోతున్నది; త్వక్ చ = చర్మం కూడా; పరిదహ్య తే ఏవ = మండుతున్నది.
తా ॥ అర్జునుడు పలికెను: ఓ కృష్ణా! యుద్ధార్థమై అరుదెంచిన బంధువులను చూసి, నా అవయవాలన్నీ పట్టు తప్పిపోతున్నాయి, నోరు ఎండుతోంది. నా శరీరం వణకుతోంది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, చేతి నుండి గాండీవం జారిపోతున్నది, చర్మం వేడెక్కుతుంది.