సంజయ ఉవాచ :
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ॥ 24
భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ ।
ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి ॥ 25
ఏవమ్, ఉక్తః, హృషీకేశః, గుడాకేశేన, భారత,
సేనయోః, ఉభయోః, మధ్యే, స్థాపయిత్వా, రథోత్తమమ్.
భీష్మద్రోణప్రముఖతః, సర్వేషామ్, చ, మహీక్షితామ్,
ఉవాచ, పార్థ, పశ్య, ఏతాన్, సమవేతాన్, కురూన్, ఇతి.
సంజయః = సంజయుడు; ఉవాచ = పలికెను: భారత = ధృతరాష్ట్రా; గుడాకేశేన = అర్జునుని చేత; ఏవమ్ = ఇట్లు; ఉక్తః = చెప్పబడి; హృషీకేశః = శ్రీకృష్ణుడు; ఉభయోః = రెండు; సేనయోః మధ్యే = సేనల మధ్యన; భీష్మద్రోణప్రముఖతః = భీష్మద్రోణుల ఎదుటను; సర్వేషామ్ చ = సకల; మహీక్షితామ్ = రాజుల ముందర; రథోత్తమమ్ = శ్రేష్ఠమైన రథాన్ని; స్థాపయిత్వా = నిల్పి; పార్థ = అర్జునా; ఏతాన్ సమవేతాన్ = ఇక్కడ సమావేశమైన కురూన్ = కౌరవులను; పశ్య = చూడు; ఇతి = అని; ఉవాచ = పలికెను.
తా ॥ సంజయుడు పలికెను: ఓ ధృతరాష్ట్రా! గుడాకేశుడైన* అర్జునుడు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పగా, శ్రీకృష్ణుడు రెండు సేనల మధ్య, భీష్మద్రోణులు తదితరులైన మహీపతుల సమ్ముఖాన రథోత్తమాన్ని నిలిపి, “పార్థా! యుద్ధం చేయడానికి సమావేశమైన ఈ కౌరవులను చూడు!” అని పలికాడు.