అర్జున ఉవాచ :
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ॥ 21
యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే ॥ 22
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ॥ 23
సేనయోః, ఉభయోః, మధ్యే, రథమ్, స్థాపయ, మే, అచ్యుత
యావత్, ఏతాన్, నిరీక్షే, అహమ్, యోద్ధుకామాన్, అవస్థితాన్,
కైః, మయా, సహ, యోద్ధవ్యమ్, అస్మిన్, రణసముద్యమే.
యోత్స్యమానాన్, అవేక్షే, అహమ్, యే, ఏతే, అత్ర, సమాగతాః,
ధార్తరాష్ట్రస్య, దుర్బుద్ధేః, యుద్ధే, ప్రియచికీర్షవః.
అర్జునః = అర్జునుడు; ఉవాచ = పలికెను; అహమ్ = నేను; యోద్ధుకామాన్ = యుద్ధం చేయగోరి; అవస్థితాన్ = ఇక్కడకు వచ్చి ఉన్న; ఏతాన్ = వీరిని; యావత్ నిరీక్షే = చూస్తాను; అస్మిన్ = ఈ; రణసముద్య మే = మహాయుద్ధ భూమిలో; కైః సహ = ఎవరితో; మయా = నా చేత; యోద్ధవ్యమ్ = యుద్ధం చేయవలసి ఉందో; అత్ర = ఇక్కడ; యుద్ధే = యుద్ధంలో; దుర్బుద్ధేః = దుష్టబుద్ధియైన; ధార్తరాష్ట్రస్య = దుర్యోధనునికి; యుద్ధే = యుద్ధంలో; ప్రియచికీర్షవః = ప్రియాన్ని చేకూర్చ దలచినవారు; యే ఏతే = ఏ వీరులు; సమాగతాః = అరుదెంచిరో; యోత్స్యమానాన్ = యుద్ధాభిలాషులైన; ఏతాన్ = అట్టి వీరిని; అహమ్ = నేను; యావత్ అవేక్షే = చూస్తాను; అచ్యుత = కృష్ణా; ఉభయోః = రెండు; సేనయోః మధ్యే = సేనల నడుమ; మే = నా; రథమ్ = రథాన్ని; స్థాపయ = నిలుపు.
తా ॥ అర్జునుడు పలికెను: నేను యుద్ధం చేయగోరి వచ్చిన వీరందరినీ చూస్తాను. ఈ మహాయుద్ధంలో ఎవరెవరితో పోరాడవలసి ఉందో గ్రహించి, దుర్బుద్ధి అయిన దుర్యోధనుని ప్రియకాములైన ఏ వీరపురుషులు యుద్ధం చేయడానికి ఈ కురుక్షేత్రానికి అరుదెంచారో వారిని చూడాలి. కాబట్టి, శ్రీకృష్ణా! ఉభయ సైన్యానికి మధ్యలో నా రథాన్ని నిలుపు.