కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ॥ 17
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ॥ 18
కాశ్యః, చ, పరమేష్వాసః, శిఖండీ, చ, మహారథః,
ధృష్టద్యుమ్నః, విరాటః, చ, సాత్యకిః, చ, అపరాజితః.
ద్రుపదః, ద్రౌపదేయాః, చ, సర్వశః, పృథివీపతే,
సౌభద్రః, చ, మహాబాహుః, శంఖాన్, దధ్ముః, పృథక్, పృథక్.
పృథివీ పతే = ధృతరాష్ట్ర భూపతీ; పరమ ఇష్వాసః = మహా ధనుర్ధరుడగు; కాశ్యః చ = కాశీరాజూ; మహారథః = మహారథుడైన శిఖండీ చ = శిఖండీ ధృష్టద్యుమ్నః చ = ధృష్టద్యుమ్నుడూ; విరాటః చ = విరాటరాజూ; అపరాజితః = అజేయుడైన; సాత్యకిః చ = సాత్యకీ; ద్రుపదః = ద్రుపదుడు, ద్రౌపదేయాః = ద్రౌపదీ పుత్రులు; మహాబాహుః = మహాభుజుడైన; సౌభద్రః చ = అభిమన్యుడూ; సర్వశః = నలువైపుల నుండి; పృథక్ పృథక్ = వేఱు వేఱుగా; శంఖాన్ = శంఖాలను; దధ్ముః = పూరించారు.
తా ॥ ఓ ధృతరాష్ట్ర భూపతీ! మహాధనుర్ధరుడైన కాశీరాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదరాజు, ద్రౌపదీ తనయ పంచకము, మహాభుజుడైన అభిమన్యుడు మొదలైనవారు నలువైపుల నుండి తమతమ శంఖాలను విడివిడిగా పూరించారు.