అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ॥ 16
అనంతవిజయమ్, రాజా, కుంతీపుత్రః, యుధిష్ఠిరః,
నకులః, సహదేవః, చ, సుఘోష మణిపుష్పకౌ.
కుంతీపుత్రః = కుంతీపుత్రుడైన; రాజా యుధిష్ఠిరః = ధర్మరాజు; అనంత విజయమ్ = అనంత విజయమనే శంఖమును; నకులః = నకులుడు; సహదేవః చ = సహదేవుడు; సుఘోషమణిపుష్పకౌ = సుఘోష, మణి పుష్పకములనే శంఖాలను, (పూరించారు).
తా ॥ (ఆ శంఖాల వివరాలు) కుంతీతనయుడైన ధర్మరాజు అనంతవిజయమనే శంఖాన్ని, నకుల-సహదేవులు సుఘోష-మణిపుష్పకాలనే శంఖాలను పూరించారు.