యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ॥ 78
యత్ర, యోగేశ్వరః, కృష్ణః, యత్ర, పార్థః, ధనుర్ధరః,
తత్ర, శ్రీః, విజయః, భూతిః, ధ్రువా, నీతిః, మతిః, మమ.
యత్ర = (ఏ పక్షంలో) ఎచట; యోగేశ్వరః = యోగేశ్వరుడైన; కృష్ణః = భగవంతుడూ; యత్ర = ఎచట; ధనుర్ధరః = ధనుర్ధరుడైన; పార్థః = నరుడూ, అర్జునుడూ కలరో; తత్ర = అచట; (ఆ పాండవ పక్షంలో); శ్రీః = రాజ్యలక్ష్మి; విజయః = విజయం; భూతిః = అభ్యుదయం; ధ్రువా = స్థిరమైన; నీతిః = రాజనీతి; (ఇతి = అని;) మే మతిః = నా అభిప్రాయం.
తా ॥ ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడూ, గాండీవ ధన్వియైన అర్జునుడూ ఉన్నారో అక్కడ స్థిరమైన రాజ్యలక్ష్మి, విజయమూ, అభ్యుదయమూ, న్యాయమూ ఉంటాయి అని నా నిశ్చయం. (కనుక, నీవు సపుత్రుడవై శ్రీకృష్ణుణ్ణి శరణు పొంది, పాండవులను ప్రసన్నులను చేసి సర్వస్వాన్నీ వారికి నివేదించి, పుత్రులను రక్షించుకో.)