రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ ।
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ॥ 76
రాజన్, సంస్మృత్య, సంస్మృత్య, సంవాదమ్, ఇమమ్, అద్భుతమ్,
కేశవ అర్జునయోః, పుణ్యమ్, హృష్యామి, చ, ముహుః ముహుః.
రాజన్ = రాజా; కేశవ అర్జునయోః = శ్రీకృష్ణార్జునుల; ఇమమ్ = ఈ; పుణ్యమ్ = శుభకరమూ; అద్భుతం = విస్మయకరమూ అయిన; సంవాదమ్ = సంభాషణను; సంస్మృత్య సంస్మృత్య = తలచి తలచి; ముహుః ముహుః చ = పదే పదే (అనుక్షణం); హృష్యామి = ఆనందిస్తున్నాను.
తా ॥ రాజా! విస్మయకరమూ, పుణ్యప్రదమూ అయిన ఈ శ్రీకృష్ణార్జున సంవాదాన్ని మళ్ళీ మళ్ళీ స్మరిస్తూ, అనుక్షణం హర్షాన్ని పొందుతున్నాను.