వ్యాసప్రసాదాచ్ఛ్రుతవాన్ ఏతద్గుహ్యమహం పరమ్ ।
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయతః స్వయమ్ ॥ 75
వ్యాసప్రసాదాత్, శ్రుతవాన్, ఏతత్, గుహ్యమ్, అహమ్, పరమ్,
యోగమ్, యోగేశ్వరాత్, కృష్ణాత్, సాక్షాత్, కథయతః, స్వయమ్.
అహమ్ = నేను; వ్యాస ప్రసాదాత్ = వ్యాసుని కృప వల్ల; ఏతత్ = ఈ; పరంగుహ్యమ్ = అత్యంత రహస్యమైన; యోగమ్ = యోగతత్త్వమైన గీతాశాస్త్రాన్ని; స్వయమ్ = స్వయంగా; కథయతః = వచించు; యోగేశ్వరాత్ = యోగేశ్వరుడైన; కృష్ణాత్ = శ్రీకృష్ణుని నుండి; సాక్షాత్ = ప్రత్యక్షంగా; శ్రుతవాన్ = విన్నాను.
తా ॥ నేను వ్యాసానుగ్రహంతో దివ్య చక్షుశ్శ్రోత్రాదులను బడసి, పరమ గుహ్యమూ, యోగతత్త్వ పూర్ణమూ అయిన ఈ గీతాశాస్త్రాన్ని సాక్షాత్తుగా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు వచిస్తుండగా విన్నాను.