అర్జున ఉవాచ :
నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్ మయాచ్యుత ।
స్థితోఽస్మి గతసందేహః కరిష్యే వచనం తవ ॥ 73
నష్టః, మోహః, స్మృతిః, లబ్ధా, త్వత్ ప్రసాదాత్, మయా, అచ్యుత,
స్థితః, అస్మి, గతసందేహః, కరిష్యే, వచనమ్, తవ.
అచ్యుత = కృష్ణా; త్వత్ ప్రసాదాత్ = నీ కృప వల్ల; మోహః = అజ్ఞానం; నష్టః = తొలగింది; మయా = నా చేత; స్మృతిః = ఆత్మతత్త్వ విషయ స్మృతి; లబ్ధా = పొందబడింది; గతసందేహః =సంశయరహితుడనై; స్థితః అస్మి = ఉన్నాను; తవ = నీ; వచనం = ఉపదేశాన్ని; కరిష్యే = పాటిస్తాను.
తా ॥ (కృతార్థుడై) అర్జునుడు పలికెను: అచ్యుతా! నీ కృపవల్ల నా మోహం వినష్టమైంది. పరమాత్మ విషయకమైన స్మృతి* లభించింది. సందేహ రహితుడనైయ్యాను.* నీ ఉపదేశాన్ని పాటిస్తాను. (యుద్ధం చేస్తాను)