ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా ।
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ॥ 63
ఇతి, తే, జ్ఞానమ్, ఆఖ్యాతమ్, గుహ్యాత్, గుహ్యతరమ్, మయా,
విమృశ్య, ఏతత్, అశేషేణ, యథా, ఇచ్ఛసి, తథా, కురు.
ఇతి = ఈ; గుహ్యాత్ గుహ్యతరమ్ = రహస్యములలో అత్యంత రహస్యమైన; జ్ఞానమ్ = గీతా తత్త్వం; తే = నీకు; మయా = నా చేత; ఆఖ్యాతమ్ = చెప్పబడింది; అశేషేణ = సంపూర్ణంగా; ఏతత్ = దీనిని; విమృశ్య = వివేచన చేసి; యథా = ఏ విధంగా; ఇచ్ఛసి = కోరుతావో; తథా = ఆ విధంగానే; కురు = చేయి.
తా ॥ రహస్యమైన మంత్రయోగాల కంటే గుహ్యమైన ఈ గీతా–తత్త్వాన్ని నీకు చెప్పాను. దీనినంతటినీ బాగా ఆలోచించి, నీకు మంచిదని తోచినట్లుగా ఆచరించు. (ఇలా ఆలోచిస్తే నీ మోహం తొలుగుతుంది.)