యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః ।
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ॥ 39
యత్, అగ్రే, చ, అనుబంధే, చ, సుఖమ్, మోహనమ్, ఆత్మనః,
నిద్ర ఆలస్య ప్రమాద ఉత్థమ్, తత్, తామసమ్, ఉదాహృతమ్.
యత్ = మరి, ఏ; సుఖమ్ = సుఖం; అగ్రే = మొదటనూ; అనుబంధే చ = తుదకునూ; ఆత్మనః = ఆత్మకు; మోహనమ్ = మోహకరమో; నిద్ర ఆలస్య ప్రమాద ఉత్థమ్ = నిద్ర, సోమరితనం, మరుపు – వీటి వల్ల కలుగుతోందో; తత్ = అది; తామసమ్ = తామసికమని; ఉదాహృతమ్ = చెప్పబడును.
తా ॥ మొదటనూ, తుదకునూ కూడా ఆత్మకు మోహాన్ని కలిగించేదీ, నిద్రాలస్యప్రమాదాల నుండి (అంటే, కర్తవ్యం విస్మృతమైన మనోరాజ్యం నుండి) కలిగేదీ అయిన సుఖం తామసికం* అనబడుతుంది.