బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ।
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ॥ 29
బుద్ధేః, భేదమ్, ధృతేః, చ, ఏవ, గుణతః, త్రివిధమ్, శృణు,
ప్రోచ్యమానమ్, అశేషేణ, పృథక్త్వేన, ధనంజయ.
ధనంజయ = అర్జునా; బుద్ధేః = బుద్ధియొక్క; ధృతేః చ = ధృతియొక్క; గుణతః ఏవ = గుణాలను అనుసరించునవే అయిన; త్రివిధమ్ = మూడు విధాలైన; భేదమ్ = భేదాన్ని; పృథక్త్వేన = వేరు వేరుగానూ; అశేషేణ = సంపూర్ణంగానూ; ప్రోచ్యమానమ్ = చెప్పబడే దానిని; శృణు = విను.
తా ॥ అర్జునా! సత్త్వరజస్తమోగుణాలను అనుసరించి బుద్ధి,* ధృతి కూడా మూడు విధాలుగా ఉన్నాయి; వీటిని గురించి వేరువేరుగా, సంపూర్ణంగా వివరిస్తాను, విను.