జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః ।
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ॥ 19
జ్ఞానమ్, కర్మ, చ, కర్తా, చ, త్రిధా, ఏవ, గుణభేదతః,
ప్రోచ్యతే, గుణసంఖ్యానే, యథావత్, శృణు, తాని, అపి.
గుణసంఖ్యానే = సాంఖ్యశాస్త్రంలో; జ్ఞానమ్ = జ్ఞానం; కర్మ చ = క్రియ; కర్తా చ = కర్త అనే; గుణభేదతః = సాత్త్వికాది గుణభేదాల; త్రిధా ఏవ = మూడు రీతులుగానే; ప్రోచ్యతే = చెప్పబడుతోంది; తాని అపి = వాటినన్నింటినీ కూడా; యథావత్ = ఉన్నవాటిని ఉన్నట్లు; శృణు = విను.
తా ॥ సాంఖ్యశాస్త్రంలో జ్ఞానం, క్రియలు, వాటి ఫలాలు అన్నీ కూడా సత్త్వరజస్తమో భేదాలతో నిర్వచించబడి ఉన్నాయి; వాటి స్వరూపాన్ని విను.