శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ॥ 15
శరీర వాక్ మనోభిః, యత్, కర్మ, ప్రారభతే, నరః,
న్యాయ్యమ్, వా, విపరీతమ్, వా, పంచ, ఏతే, తస్య, హేతవః.
నరః = మనుష్యుడు; శరీర వాక్ మనోభిః = త్రికరణాలతో; యత్ = ఏ, న్యాయ్యమ్ వా = ధర్మయుక్తమూ, శాస్త్రీయమూ అయినది గాని; విపరీతమ్ వా = అన్యాయమైనది గాని; ఏతే = ఈ; పంచ = ఐదూ; తస్య = ఆ కర్మకు; హేతవః = హేతువులు.
తా ॥ త్రికరణాలతో మనుష్యుడు ఆరంభించే ధర్మాధర్మ కర్మలన్నిటికీ ఈ ఐదూ హేతువులని గ్రహించు.