పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ।
“సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ॥ 13
పంచ, ఏతాని, మహాబాహో, కారణాని, నిబోధ, మే,
సాంఖ్యే, కృత అంతే, ప్రోక్తాని, సిద్ధయే, సర్వకర్మణామ్.
మహాబాహో = అర్జునా; సాంఖ్యే = వేదాంత; కృత అంతే = సిద్ధాంతంలో; సర్వకర్మణామ్ = సమస్తకర్మల; సిద్ధయే = సిద్ధికై; ప్రోక్తాని = చెప్పబడిన; ఏతాని = ఈ; పంచ = ఐదు; కారణాని = కారణాలను; మే = నా వల్ల; నిబోధ = తెలుసుకో.
తా ॥ (కర్మ ఒనర్చుతున్నప్పటికీ, కర్మఫలం ఎలా లభించకుండా ఉండ గలదు? అని ఆశంకించి, త్యాగశీలుడైన నిరహంకారికి కర్మలేపం లేదని ప్రతిపాదిస్తున్నాడు:) అర్జునా! వేదాంత సిద్ధాంతంలో కర్మలను అన్నింటి నిష్పత్తి కొరకు ఈ ఐదు కారణాలు నిరూపింపబడ్డాయి. వాటిని నా ద్వారా తెలుసుకో.