సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ।
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ॥ 26
సద్భావే, సాధుభావే, చ, సత్, ఇతి, ఏతత్, ప్రయుజ్యతే,
ప్రశస్తే, కర్మణి, తథా, సత్, శబ్దః, పార్థ, యుజ్యతే.
పార్థ = అర్జునా; సద్భావే = సత్త అనే అర్థంలోనూ; సాధుభావే చ = ‘మంచిది’ అనే అర్థంలోనూ; సత్ ఇతి ఏతత్ = సత్ అనేది; ప్రయుజ్యతే = ప్రయోగింపబడుతోంది; తథా = మరియు; ప్రశస్తే = శుభమైన; కర్మణి = కర్మకు కూడా; సత్ శబ్దః = సత్ అనే నిర్దేశం; యుజ్యతే = వాడబడుతోంది.
తా ॥ (సత్–శబ్దాన్ని ప్రశంసిస్తున్నాడు:) పార్థా! అస్తిత్వాన్ని, శ్రేష్ఠత్వాన్ని సూచించడానికి ‘సత్’ శబ్దం వాడబడుతోంది; శుభకర్మలకు కూడా ఇదే ప్రయోగించబడుతుంది.