సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ ।
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ॥ 18
సత్కార మాన పూజ అర్థమ్, తపః, దంభేన, చ, ఏవ, యత్,
క్రియతే, తత్, ఇహ, ప్రోక్తమ్, రాజసమ్, చలమ్, అధ్రువమ్.
సత్కార-మాన–పూజ–అర్థమ్ = సత్కారం, గౌరవం, పూజను పొందడానికి; దంభేన ఏవ చ = దంభంతో; యత్ = ఏ; తపః = తపస్సు; క్రియతే = ఆచరింపబడుతుందో; తత్ = అది; ఇహ = ఈ లోకంలో; చలమ్ = అల్పకాలం ఉండేదనీ; అధ్రువమ్ = అనిశ్చితమనీ; రాజసమ్ = రాజసమనీ; ప్రోక్తమ్ = చెప్పబడింది;
తా ॥ ఇతరులచే ‘ఇతడు తపస్వి, సాధువు’ అని ప్రశంసింపబడటానికీ, నమస్కారాదులను పొందడానికీ, ధనాదికమును పొందడానికీ, దంభంతో అనుష్ఠించబడే తపస్సును రాజసికం అంటారు; ఇది అనిత్యం, క్షణికం.