ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథమ్ ।
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ॥ 13
ఇదమ్, అద్య, మయా, లబ్ధమ్, ఇదమ్, ప్రాప్స్యే, మనోరథమ్,
ఇదమ్, అస్తి, ఇదమ్, అపి, మే, భవిష్యతి, పునః, ధనమ్.
అద్య = నేడు; మయా = నా చేత; ఇదమ్ = ఇది; లబ్ధమ్ = సంపాదింపబడింది; ఇదమ్ = ఈ; మనోరథమ్ = కోరికను; ప్రాప్స్యే = పొందగలను; ఇదమ్ = ఈ ధనం; అస్తి = ఉంది; పునః = మళ్ళీ; మే = నాకు; ఇదమ్ = ఈ; ధనం అపి = ధనం కూడా; భవిష్యతి = రాగలదు.
తా ॥ (వారి మనోరాజ్యాన్ని వర్ణించి, నరకప్రాప్తిని చెబుతున్నాడు-) ‘నేడు నాకిది లభించింది, ఈ మనోరథం ముందు చేకూరగలదు, ఈ ధనం నాకు ఉంది, ఇంకా ఇంత ధనం రాగలదు’ ;