యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖీలమ్ ।
యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12
యత్, ఆదిత్యగతమ్, తేజః, జగత్, భాసయతే, అఖీలమ్,
యత్, చంద్రమసి, యత్, చ, అగ్నౌ, తత్, తేజః, విద్ధి, మామకమ్.
ఆదిత్యగతమ్ = సూర్యుని యందుండే; యత్ = ఏ; తేజః = తేజస్సు; అఖీలమ్ జగత్ = విశ్వాన్నంతటనీ; భాసయతే = ప్రకాశింపజేస్తున్నదో; చంద్రమసి చ = మరియు, చంద్రునిలో; యత్ = ఏ తేజం ఉందో; అగ్నౌచ = అగ్నిలో కూడా; యత్ = ఏ తేజం ఉందో; తత్ = ఆ; తేజః = జ్యోతిని; మామకమ్ = నాదిగా; విద్ధి = తెలుసుకో.
తా ॥ (పరమ పదం, దాన్ని పొందే ఉపాయం, తత్ఫలమైన అపునరావృత్తి, సంసారి స్వరూపం వర్ణింపబడ్డాయి; ఇక పరమేశ్వరుణ్ణి అనంత శక్తియుతునిగా నిరూపిస్తున్నాడు:) సూర్యచంద్రాగ్నుల యందు ఉండి జగత్తు నంతటినీ ప్రకాశింపజేస్తున్న తేజం నాదే అని తెలుసుకో. (ముండకోపనిషత్తు 2-2-10 చూ:).