ఊర్ధ్వం గచ్ఛంతి సత్త్వస్థా మధ్యే తిష్ఠంతి రాజసాః ।
జఘన్యగుణవృత్తిస్థా అధో గచ్ఛంతి తామసాః ॥ 18
ఊర్ధ్వమ్, గచ్ఛంతి, సత్త్వస్థాః, మధ్యే, తిష్ఠంతి, రాజసాః,
జఘన్య గుణవృత్తిస్థాః, అధః, గచ్ఛంతి, తామసాః.
సత్త్వస్థా = సాత్వికులు; ఊర్ధ్వమ్ = దేవ లోకాలకు; గచ్ఛంతి = పోవుచున్నారు; రాజసాః = రాజసికులు; మధ్యే = మనుష్యలోకంలో; తిష్ఠంతి = ఉంటారు; జఘన్య గుణ వృత్తిస్థాః = నీచగుణ వృత్తులందున్న; తామసాః = తామసికులు; అధః = నిమ్న లోకాలకు; గచ్ఛంతి = వెళుతున్నారు.
తా ॥ (సత్త్వాది వృత్తిశీలుర ఫలభేదం చెప్పబడుతోంది.) సాత్త్వికులు మనుష్య–గంధర్వ లోకం నుండి సత్య లోకం వరకూ గల ఊర్ధ్వ లోకాలకు పోతున్నారు. రాజసికులు మనుష్య లోకంలోనే జన్మిస్తున్నారు. ఆలస్య నిద్రాది యుతులైన తామసికులు తామిస్రాది నరకాలలో (పశ్వాది యోనులలో) పడుతున్నారు.