రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే ।
తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే ॥ 15
రజసి, ప్రళయమ్, గత్వా, కర్మసంగిషు, జాయతే,
తథా, ప్రలీనః, తమసి, మూఢయోనిషు, జాయతే.
రజసి = రజోగుణం వృద్ధి చెందినప్పుడు; ప్రళయం గత్వా = మృతి చెందితే; కర్మసంగిషు = కర్మాసక్తులైన మనుష్యులలో; జాయతే = జన్మిస్తాడు; తథా = అదేవిధంగా; తమసి = తమోగుణ వృద్ధికాలంలో; ప్రలీనః = మరణిస్తే; మూఢయోనిషు =పశుపక్ష్యాది యోనులలో; జాయతే = జన్మిస్తాడు.
తా ॥ రజోగుణం ప్రబలమైన స్థితిలో మరణిస్తే, కర్మాసక్తమైన మనుష్యలోకంలో జన్మిస్తున్నాడు; అదే విధంగా, తమోగుణం వృద్ధి చెందినప్పుడు చనిపోయిన యెడల పశుపక్ష్యాది మూఢయోనులలో పుడుతున్నాడు.