జ్ఞేయం యత్తత్ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వాఽమృతమశ్నుతే ।
అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే ॥
జ్ఞేయమ్, యత్, తత్, ప్రవక్ష్యామి, యత్, జ్ఞాత్వా, అమృతమ్, అశ్నుతే,
అనాదిమత్, పరమ్, బ్రహ్మ, న, సత్, తత్, న, అసత్, ఉచ్యతే.
యత్ = ఏది; జ్ఞేయమ్ = తెలిసికో దగినదో; యత్ = దేనిని; జ్ఞాత్వా = గ్రహిస్తే; అమృతమ్ = అమరత్వం (మోక్షాన్ని); అశ్నుతే = పొందునో; తత్ = దానిని; ప్రవక్ష్యామి = చెబుతున్నాను; తత్ = అది; అనాది మత్ = ఆది రహితం; పరమ్ బ్రహ్మ = పరబ్రహ్మం; న సత్ = సత్ శబ్ద గోచరం కాదు; న అసత్ = అసత్ ప్రత్యయ గోచరమూ కాదు (అని); ఉచ్యతే = చెప్పబడుతోంది;
తా ॥ (ఇక జ్ఞేయం ఆరు శ్లోకాలలో వర్ణించబడుతోంది 🙂 అర్జునా! దేనిని తెలుసుకుంటే అమృతత్వం లభిస్తుందో దానిని చెబుతాను. ఆ ఆదిరహితమైన పరబ్రహ్మం సత్–ప్రత్యయానికీ, అసత్–ప్రత్యయానికీ కూడా అగోచరం; సత్–శబ్దానికీ, అసత్–శబ్దానికీ కూడా అలక్ష్యం. ఏలయన, ఇంద్రియ గోచరాలైన వస్తువులన్నీ సత్-అసత్ అని చెప్పజాలనివి, కాని బ్రహ్మం ఇంద్రియ గోచరం కాదు.