అభ్యాసేఽప్యసమర్థోఽసి మత్కర్మపరమో భవ ।
మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి ॥ 10
అభ్యాసే, అపి, అసమర్థః, అసి, మత్కర్మ పరమః, భవ,
మత్ అర్థమ్, అపి, కర్మాణి, కుర్వన్, సిద్ధిమ్, అవాప్స్యసి.
అభ్యాసే అపి = ఈ అభ్యాసం చేయడానికి కూడా; అసమర్థః అసి = సమర్థుడవు కాకపోతే; మత్కర్మ పరమః = నా కర్మలను ఆచరించేవాడవు; భవ = కమ్ము; మత్ అర్థం = నా నిమిత్తం; కర్మాణి = కర్మలను; కుర్వన్ అపి = ఆచరిస్తున్నా కూడా; సిద్ధిమ్ = సిద్ధిని; అవాప్స్యసి = పొందుతావు.
తా ॥ ఇలాంటి అభ్యాసం చేయడానికి కూడా నీవు సమర్థుడవు కాకపోతే, భగవత్ప్రీతికరమైన కర్మలను ఆచరించు; ఇటువంటి కర్మలను* ఆచరిస్తూ ఉన్నా నీవు సిద్ధిని పొందగలవు.