శ్రీ భగవానువాచ :
పశ్య మే పార్థ రూపాణి శతశోఽథ సహస్రశః ।
నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ॥ 5
పశ్య, మే, పార్థ, రూపాణి, శతశః, అథ, సహస్రశః,
నానావిధాని, దివ్యాని, నానావర్ణ ఆకృతీని, చ.
పార్థ = అర్జునా; మే = నా; దివ్యాని = అలౌకికములును; నానా విధాని = బహు విధాలైన; నానా వర్ణ ఆకృతీని చ = వివిధ వర్ణాలతో, ఆకృతులతో ఒప్పుచున్నవీ; శతశః = వందలూ; అథ = ఇంకా; సహస్రశః = వేలూ అయిన; రూపాణి = రూపాలను; పశ్య = చూడు;
తా ॥ (అత్యద్భుతమైన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ అర్జునుణ్ణి సావధానుణ్ణి చేస్తూ) శ్రీభగవానుడు పలికెను: పార్థా! నానావిధ వర్ణాలతో, ఆకృతులతో ఒప్పారుతున్న; అనేకాలూ* , విభిన్నాలూ అయిన దివ్యరూపాలను దర్శించు.