భక్త్యా త్వనన్యయా శక్య అహమేవంవిధోఽర్జున ।
జ్ఞాతుం ద్రష్టుం చ తత్త్వేన ప్రవేష్టుం చ పరంతప ॥ 54
భక్త్యా, తు, అనన్యయా, శక్యః, అహమ్, ఏవం విధః, అర్జున,
జ్ఞాతుమ్, ద్రష్టుమ్, చ, తత్త్వేన, ప్రవేష్టుమ్, చ, పరంతప.
పరంతప = శత్రుతాపనా; అర్జున = అర్జునా; తు = కేవలం; అనన్యయా = అనన్యమైన; భక్త్యా = భక్తిచేతనే; ఏవం విధః = ఈ రీతిగా; తత్త్వేన = యథార్థంగా; జ్ఞాతుమ్ = తెలుసుకోవడానికి; ద్రష్టుం చ = సాక్షాత్కరించుకోవడానికి; ప్రవేష్టుం చ = ప్రవేశించడానికి (ఐక్యమునందుటకు); అహమ్ = నేను; శక్యః = అలవియగుదును.
తా ॥ అర్జునా! యథార్థంగా నన్ను గురించిన శాస్త్రజ్ఞానమూ, ప్రత్యక్ష సాక్షాత్కారమూ, తాదాత్మ్యమైన మోక్షమూ కేవలం అనన్యభక్తి వల్లనే సంభవ మవుతుంది. పరంతపా! అనన్యభక్తి ఒక్కటే విశ్వరూపాన్ని దర్శింప జేయగలదు.