సంజయ ఉవాచ :
ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా
స్వకం రూపం దర్శయామాస భూయః ।
ఆశ్వాసయామాస చ భీతమేనం
భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా ॥ 50
ఇతి, అర్జునమ్, వాసుదేవః, తథా, ఉక్త్వా, స్వకమ్, రూపమ్, దర్శయామాస, భూయః,
ఆశ్వాసయామాస, చ, భీతమ్, ఏనమ్, భూత్వా, పునః, సౌమ్యవపుః, మహాత్మా.
వాసుదేవః = శ్రీకృష్ణుడు; అర్జునమ్ = అర్జునునితో; ఇతి = ఇట్లు; ఉక్త్వా = పలికి; భూయః = మళ్ళీ; తథా = ఆ రీతిగానే; స్వకమ్ = తన; రూపమ్ = చతుర్భుజమూర్తిని; దర్శయామాస = చూపెను; మహాత్మా = విశ్వాత్ముడు; సౌమ్య వపుః = ప్రసన్నరూపుడు; భూత్వా = అయి; భీతమ్ = భీతి చెందిన; ఏనమ్ = అర్జునుణ్ణి; ఆశ్వాసయామాస చ = ఓదార్చెను.
తా ॥ సంజయుడు పలికెను: వాసుదేవుడు అర్జునునితో ఇలా పలికి, మళ్ళీ తన పూర్వరూపాన్ని దర్శింపజేసాడు. విశ్వమూర్తి సౌమ్యమూర్తియై భీతుడైన అర్జునుణ్ణి ఓదార్చాడు.