మన్యసే యది తచ్ఛక్యం మయా ద్రష్టుమితి ప్రభో ।
యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయమ్ ॥ 4
మన్యసే, యది, తత్, శక్యమ్, మయా, ద్రష్టుమ్, ఇతి, ప్రభో,
యోగ ఈశ్వర, తతః, మే, త్వమ్, దర్శయ, ఆత్మానమ్, అవ్యయమ్.
ప్రభో = ప్రభూ; తత్ = ఆ విశ్వరూపాన్ని; మయా = నాచే; ద్రష్టుమ్ = దర్శింప; శక్యమ్ ఇతి = సాధ్యం అని; మన్యసే యది = తలతువేని; యోగ ఈశ్వర = యోగేశ్వరా; తతః = ఇక; త్వమ్ = నీవు; మే = నాకు; అవ్యయమ్ = నిత్యమైన; ఆత్మానమ్ = జగదాత్మరూపాన్ని; దర్శయ = దర్శింప చేయి.
తా ॥ (నాకు చూడాలని ఉంది కాబట్టి చూపమని కాదు,) ప్రభూ! నేను ఆ విశ్వరూపాన్ని చూడ యోగ్యుణ్ణని తలిస్తే, యోగేశ్వరా! నాకు అవ్యయమైన నీ జగదాత్మరూపాన్ని దర్శింపజేయి.