పితాసి లోకస్య చరాచరస్య
త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ ।
న త్వత్సమోఽస్త్యభ్యధికః కుతోఽన్యో
లోకత్రయేఽప్యప్రతిమప్రభావ ॥ 43
పితా, అసి, లోకస్య, చర అచరస్య, త్వమ్, అస్య, పూజ్యః, చ, గురుః, గరీయాన్,
న, త్వత్, సమః, అస్తి, అభ్యధికః, కుతః, అన్యః, లోకత్రయే, అపి, అప్రతిమప్రభావ.
అప్రతిమ ప్రభావ = అతులనీయ శక్తీ; త్వమ్ = నీవు; అస్య = ఈ; చర అచరస్య = స్థావర జంగమాత్మకమైన; లోకస్య = జగత్తుకి; పితా = స్రష్టవు; పూజ్యః = పూజ్యనీయుడవు; గురుః = గురుడవు; గరీయాన్ చ = పెద్దవు; అసి = అయి ఉన్నావు; లోక త్రయే అపి = ముల్లోకాలలో; త్వత్సమః = నీకు సమానుడైన వాడు; న అస్తి = లేడు; అభ్యధికః = నిన్ను మించినవాడు; అన్యః = మరొకడు; కుతః = ఎక్కడ?
తా ॥ నిరుపమప్రభావా! స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తుకు నీవు స్రష్టవు, పూజ్యనీయుడవు, గురుడవు, పెద్దవు. త్రిభువనాలలో నీకు సమానులైన వారు లేరు, నీకంటే శ్రేష్ఠమైనవారు లేరు.