త్వమాదిదేవః పురుషః పురాణః
త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ ।
వేత్తాసి వేద్యం చ పరం చ ధామ
త్వయా తతం విశ్వమనంతరూప ॥ 38
త్వమ్, ఆదిదేవః, పురుషః, పురాణః, త్వమ్, అస్య, విశ్వస్య, పరమ్, నిధానమ్,
వేత్తా, అసి, వేద్యమ్, చ, పరమ్, చ, ధామ, త్వయా, తతమ్, విశ్వమ్, అనంతరూప.
అనంత రూప = అనంతరూపా; త్వమ్ = నీవు; ఆదిదేవః = ఆది దేవుడవు; పురాణః = అనాదివి (సనాతనుడవైన); పురుషః = పురుషుడవు; త్వమ్ = నీవు; అస్య = ఈ విశ్వస్య = జగత్తుకు; పరమ్ = ఏకమాత్రమైన; నిధానమ్ = ఆశ్రయభూతుడవు; వేత్తా = సర్వజ్ఞుడవు (జ్ఞాతవు); వేద్యం చ = జ్ఞేయానివి; పరంధామ చ = శ్రేష్ఠ పదం; అసి = అయి ఉన్నావు; త్వయా = నీచే; విశ్వమ్ = జగత్తు; తతమ్ = వ్యాప్తమై ఉంది.
తా ॥ అనంతరూపా! నీవు ఆది దేవుడవు, పురాణపురుషుడవు, విశ్వలయ స్థానానివి, నీవే జ్ఞాతవు, జ్ఞేయానివి, పరంధాముడవు. నీవు ఈ విశ్వామంతా వ్యాపించి ఉన్నావు.