యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశంతి నాశాయ సమృద్ధవేగాః ।
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ॥ 29
యథా, ప్రదీప్తమ్, జ్వలనమ్, పతంగాః, విశంతి, నాశాయ, సమృద్ధవేగాః,
తథా, ఏవ, నాశాయ, విశంతి, లోకాః, తవ, అపి, వక్త్రాణి, సమృద్ధవేగాః.
పతంగాః = మిడుతలు, సమృద్ధవేగాః = చాలా తొందరగా; యథా = ఏ విధంగా; ప్రదీప్తమ్ = మండుతున్న; జ్వలనమ్ = నిప్పులో; నాశాయ = మృతి చెందడానికి; విశంతి = ప్రవేశిస్తున్నాయో; తథా = అదే విధంగా; లోకాఃఅపి = జనులు కూడా; సమృద్ధవేగాః = అతివేగంతో; నాశాయ ఏవ = మృతి చెందడానికే; తవ = నీ; వక్త్రాణి = నోటిలో; విశంతి = పడుచున్నారు.
తా ॥ మిడుతలు వేగంగా పరుగెత్తి మండుతున్న నిప్పులలో పడడం చావు కొరకే అయిన రీతిగా, జనులందరూ కూడా మృతిచెందడానికి అతివేగంగా నీ ముఖవివరముల ప్రవేశిస్తున్నారు.