రూపం మహత్తే బహువక్త్రనేత్రం
మహాబాహో బహుబాహూరుపాదమ్ ।
బహూదరం బహుదంష్ట్రాకరాళం
దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ॥ 23
రూపమ్, మహత్, తే, బహువక్త్ర నేత్రమ్, మహాబాహో, బహు బాహు ఊరు పాదమ్,
బహు ఉదరమ్, బహు దంష్ట్రాకరాళమ్, దృష్ట్వా, లోకాః, ప్రవ్యథితాః, తథా, అహమ్.
మహాబాహో = భగవంతుడా; తే = నీ; బహు వక్త్ర నేత్రమ్ = పెక్కు ముఖ నేత్రాలతో; బహు బాహు ఊరు పాదం = అనేక చేతులు, కాళ్ళు, తొడలతో; బహు ఉదరమ్ = అనేక ఉదరాలతో; బహు దంష్ట్రాకరాళం = పెక్కు కోఱలతో భయంకరమైన; మహత్ రూపమ్ = విశ్వరూపాన్ని; దృష్ట్వా = చూసి; లోకాః = జనులందరూ; ప్రవ్యథితాః = భయపడుతున్నారు; తథా = అలాగే; అహమ్ = నేను కూడా (భయపడుతున్నాను).
తా ॥ ప్రభూ! అనేక ముఖనేత్రాలతో, హస్తపాదాలతో, ఊరువులతో, ఉదరాలతో నీ విశ్వరూపం ఒప్పారుతోంది; అసంఖ్యాక దంష్ట్రాలతో భయంకరమై తోచుతోంది. ఈ రూపాన్ని గాంచి ప్రాణులందరూ, నేను కూడా భీతిగ్రస్తులం అవుతున్నాం.