రుద్రాదిత్యా వసవో యే చ సాధ్యా
విశ్వేఽశ్వినౌ మరుతశ్చోష్మపాశ్చ ।
గంధర్వయక్షాసురసిద్ధసంఘాః
వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే ॥ 22
రుద్ర ఆదిత్యాః, వసవః, యే, చ, సాధ్యాః, విశ్వే, అశ్వినౌ, మరుతః, చ, ఉష్మపాః, చ,
గంధర్వయక్షా సురసిద్ధ సంఘాః, వీక్షంతే, త్వామ్, విస్మితాః, చ, ఏవ, సర్వే.
రుద్ర ఆదిత్యాః = రుద్రులూ, ఆదిత్యులూ; వసవః = వసువులూ; యే చ = మరియు తదితరులైన; సాధ్యాః = సాధ్యులూ; విశ్వే = విశ్వేదేవతలూ; అశ్వినౌ = అశ్వినీ కుమారద్వయమూ; మరుతః చ = మరుద్దేవతలూ; ఉష్మపాః = పితృదేవతలూ; గంధర్వ యక్ష అసుర సిద్ధ సంఘాః చ = గంధర్వుల, యక్షుల, రాక్షసుల, సిద్ధుల సమూహమూ; సర్వే ఏవ చ = అందరూ కూడా; విస్మితాః = ఆశ్చర్యపడి; త్వాం = నిన్ను; వీక్షంతే = చూస్తున్నారు.
తా ॥ రుద్రులు, ఆదిత్యులు, వసువులు, సాధ్యులు* , విశ్వే దేవతలు,* అశ్వినీ దేవతలు, మరుద్గణము, పితృదేవతలు* , గంధర్వులు, యక్షులు, అసురులు, సిద్ధులు మున్నగువారు అందరూ కూడా విస్మితులై నిన్ను వీక్షిస్తున్నారు.