అనేకబాహూదరవక్త్రనేత్రం
పశ్యామి త్వాం సర్వతోఽనంతరూపమ్ ।
నాంతం న మధ్యం న పునస్తవాదిం
పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ॥ 16
అనేక బాహు ఉదర వక్త్ర నేత్రమ్, పశ్యామి, త్వామ్, సర్వతః, అనంత రూపమ్,
న, అంతమ్, న, మధ్యమ్, న, పునః, తవ, ఆదిమ్, పశ్యామి, విశ్వ ఈశ్వర, విశ్వరూప.
విశ్వ ఈశ్వరా = జగదీశ్వరా; విశ్వరూప = విరాడ్రూపధరా; అనేక బాహు ఉదర వక్త్ర నేత్రం = అసంఖ్యాకమైన హస్త, ఉదర, ముఖ, నేత్రయుతుడమా; అనంత రూపమ్ = అనంతరూపధరుడవు అయిన; త్వామ్ = నిన్ను; సర్వతః = సర్వత్ర; పశ్యామి = చూస్తున్నాను; పునః =మరియు; తవ = నీ; అంతమ్ = తుదిని; న పశ్యామి = చూడలేకున్నాను; మధ్యం = మధ్యభాగాన్ని; న పశ్యామి = చూడలేకున్నాను; ఆదిమ్ = మొదలును కూడా; న పశ్యామి = చూడజాలకున్నాను.
తా ॥ విశ్వేశ్వరా! సర్వత్రా అనంతమైన నీ రూపమే కనబడుతోంది; అసంఖ్యాలైన బాహూదర నయన వదనాలతో అది ఒప్పుతోంది. విశ్వరూపా! నీ ఆదిమధ్యాంతాలను చూడజాలకున్నాను. నీవు సర్వగతుడవు.