నాంతోఽస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ।
ఏష తూద్దేశతః ప్రోక్తో విభూతేర్విస్తరో మయా ॥ 40
న, అంతః, అస్తి, మమ, దివ్యానామ్, విభూతీనామ్, పరంతప,
ఏషః, తు, ఉద్దేశతః, ప్రోక్తః, విభూతేః, విస్తరః, మయా.
పరంతప = అర్జునా; మమ = నా; దివ్యానామ్ = దివ్యములైన; విభూతీనామ్ = విభూతులకు; అంతః = తుది; న అస్తి = లేదు; ఏషః తు = అయినా ఈ; విభూతేః = విభూతుల; విస్తారః = వివరణ; మయా = నాచే; ఉద్దేశతః = సంక్షేపంగా; ప్రోక్తః = చెప్పబడింది.
తా ॥ (ప్రకరణం ఉపసంహరించబడుతోంది-) అర్జునా! దివ్యములైన నా విభూతులకు పరిమితి లేదు; అయినప్పటికీ సంక్షేపంగా ఈ విభూతులను వర్ణించాను.