అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ ।
పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్ ॥ 29
అనంతః, చ, అస్మి, నాగానాం, వరుణః, యాదసామ్, అహమ్,
పితౄణామ్, అర్యమా, చ, అస్మి, యమః, సంయమతామ్, అహమ్.
నాగానాం = పెక్కుతలలు గల నాగులలో; అనంతః = శేషుడను; అస్మి = అయి ఉన్నాను; యాదసాం చ = జలదేవతలలో; అహమ్ = నేను; వరుణః = వారికి రాజైన వరుణుణ్ణి; పితౄణామ్ = పితృదేవతలలో; అర్యమా = అర్యముణ్ణి; సంయమతాం చ = శాసించే వారిలో; యమః = యముడను; అహమ్ = నేను; అస్మి = అయి ఉన్నాను
తా ॥ పెక్కుతలలు గల నాగులలో అనంతుణ్ణి, జల దేవతలలో వరుణుణ్ణి, పితృదేవతలలో అర్యముణ్ణి* , శాసించే వారిలో యముణ్ణి నేను అయి ఉన్నాను.