పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిమ్ ।
సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః ॥ 24
పురోధసామ్, చ, ముఖ్యమ్, మామ్, విద్ధి, పార్థ, బృహస్పతిమ్,
సేనానీనామ్, అహమ్, స్కందః, సరసామ్, అస్మి, సాగరః.
పార్థ = అర్జునా; మామ్ = నన్ను; పురోధసాం చ = పురోహితులలో; ముఖ్యమ్ = ప్రధానుడైన; బృహస్పతిమ్ = బృహస్పతిగా; విద్ధి = గ్రహించు; అహమ్ = నేను; సేనానీనామ్ = సేనాపతులలో; స్కందః = కుమారస్వామిని; సరసామ్ = సరస్సులలో; సాగరః = సముద్రుణ్ణి; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ అర్జునా! నేను పురోహితులలో (దేవపురోహితుడగుట వలన) ముఖ్యుడైన బృహస్పతిని* , సేనాపతులలో దేవసేనానాయకుడైన కుమారస్వామిని* , జలాశయాలలో సముద్రుణ్ణి.