వేదానాం సామవేదోఽస్మి దేవానామస్మి వాసవః ।
ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా ॥ 22
వేదానామ్, సామవేదః, అస్మి, దేవానామ్, అస్మి, వాసవః,
ఇంద్రియాణామ్, మనః, చ, అస్మి, భూతానామ్, అస్మి, చేతనా.
వేదానామ్ = చతుర్వేదాలలో; సామ వేదః = సామ వేదాన్ని; అస్మి = అయి ఉన్నాను; దేవానామ్ = దేవతలలో; వాసవః = ఇంద్రుడను; అస్మి = అయి ఉన్నాను; ఇంద్రియాణామ్ = ఏకాదశేంద్రియాలలో; మనః = సంకల్ప వికల్పాత్మకమైన మనస్సును; అస్మి = అయి ఉన్నాను; భూతానాం చ = ప్రాణుల శరీరంలో; చేతనా = జ్ఞాన శక్తిని; అస్మి = అయి ఉన్నాను.
తా ॥ వేదాలలో నేను సామ వేదాన్ని, త్రింశత్ కోటి దేవతలలో నేను ఇంద్రుణ్ణి, ఏకాదశేంద్రియాలలో సంకల్పవికల్పాత్మకమైన మనస్సుని. ప్రాణుల శరీరమందు ఉండే జ్ఞానశక్తిని కూడా నేనే.