సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ ।
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః ॥ 14
సర్వమ్, ఏతత్, ఋతమ్, మన్యే, యత్, మామ్, వదసి, కేశవ,
న, హి, తే, భగవన్, వ్యక్తిమ్, విదుః, దేవాః, న, దానవాః.
కేశవ = కృష్ణా; మామ్ = నన్ను గూర్చి; యత్ = దేనిని; వదసి = చెప్పుచున్నావో; ఏతత్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఋతమ్ = సత్యమని; మన్యే = తలతును; హి = ఏమన; భగవన్ = ఈశ్వరా; తే = నీ; వ్యక్తిమ్ = ఆవిర్భావమును; దేవాః = దేవతలు; దానవాః = దానవులు; న విదుః = ఎరుగరు.
తా ॥ కేశవా! నీవు నాకు చెబుతున్న సమస్తమూ సత్యమనే విశ్వసిస్తున్నాను. దేవా! నీ ఆవిర్భావాన్ని దేవతలూ (అది తమ అనుగ్రహార్థమే అనీ) దానవులు కూడా (అది తమ నిగ్రహార్థమే అని) ఎరుగరు కదా!