అర్జున ఉవాచ :
పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ ।
పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుమ్ ॥ 12
ఆహుస్త్వాం ఋషయస్సర్వే దేవర్షిర్నారదస్తథా ।
అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే ॥ 13
పరమ్, బ్రహ్మ, పరమ్, ధామ, పవిత్రమ్, పరమమ్, భవాన్,
పురుషమ్, శాశ్వతమ్, దివ్యమ్, ఆదిదేవమ్, అజమ్, విభుమ్.
ఆహుః, త్వామ్, ఋషయః, సర్వే, దేవర్షిః, నారదః, తథా,
అసితః, దేవలః, వ్యాసః, స్వయమ్, చ, ఏవ, బ్రవీషి, మే.
భవాన్ = నీవు; పరంబ్రహ్మ = పరబ్రహ్మవు; పరంధామ = పరమపదమవు; పరమమ్ = ప్రకృష్టంగా; పవిత్రమ్ = పావనుడవు; ఋషయః = ఋషులు; సర్వే = అందరూ; దేవర్షిః నారదః = దేవర్షి నారదుడూ; తథా = మరియు; అసితః = అసితుడూ; దేవలః = దేవలుడూ; వ్యాసః చ = వ్యాసుడూ; త్వామ్ = నిన్ను; శాశ్వతమ్ = సనాతనుడవు; దివ్యం పురుషమ్ = దివ్య పురుషుడవు; ఆది-దేవమ్ = ఆదిదేవుడవు; అజమ్ = జన్మరహితుడవు; విభుమ్ = సర్వవ్యాపివి; ఆహుః = అని చెప్పుచున్నారు; స్వయం ఏవ చ = నీవు కూడా; మే = నాకు; బ్రవీషి = చెప్పుచున్నావు.
తా ॥ అర్జునుడు పలికెను: నీవు పరబ్రహ్మవు, పరమ పదానివి, పరమ పావనుడవు; నీవు సర్వవ్యాపివి, సనాతనుడవు, జన్మరహితుడవు, దివ్యపురుషుడవు, ఆదిదేవుడవు. ఋషులందరూ, దేవర్షి నారదుడూ, అసితుడూ, దేవలుడూ* , వ్యాసుడు కూడా నిన్ను ఈ విధంగానే వర్ణిస్తున్నారు. నీవు కూడా నాకు అలాగే చెబుతున్నావు.