న చ శ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే ॥ 31
న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ ।
న, చ, శ్రేయః, అనుపశ్యామి, హత్వా, స్వజనమ్, ఆహవే
న, కాంక్షే, విజయమ్, కృష్ణ, న, చ, రాజ్యమ్, సుఖాని, చ
కృష్ణ = శ్రీకృష్ణా; ఆహవే = యుద్ధమున; స్వజనమ్ = బంధువులను; హత్వా = చంపి; శ్రేయః = శుభమును; న అనుపశ్యామి = చూడజాలకున్నాను, విజయం = యుద్ధజయమును; రాజ్యం చ = రాజ్యలాభమును; సుఖాని చ = సుఖములను; న కాంక్షే = కోరను.
తా ॥ కృష్ణా! యుద్ధంలో బంధువులను చంపడం వల్ల ఒరిగే శుభాన్ని గ్రహించలేకున్నాను. యుద్ధంలో జయాన్ని గాని; రాజ్య-సుఖభోగాలు గాని నేను కోరడం లేదు.