న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః ॥ 30
నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ ।
న, చ, శక్నోమి, అవస్థాతుమ్, భ్రమతి, ఇవ, చ, మే, మనః
నిమిత్తాని, చ, పశ్యామి, విపరీతాని, కేశవ కే
శవ = కృష్ణా; అవస్థాతుమ్ = స్థిరంగా ఉండడానికి; న శక్నోమి = సమర్థుడను కాకున్నాను; మే = నా; మనః చ = మనస్సూ; భ్రమతి ఇవ = భ్రమకులోనవుతోంది; విపరీతాని = అశుభ సూచకములైన; నిమిత్తాని = శకునములు; పశ్యామి = చూస్తున్నాను.
తా ॥ కేశవా! నేనింక స్థిరంగా ఉండజాలకున్నాను. నా మనస్సు చంచలమగుచున్నది, అమంగళ సూచకాలైన అపశకునాలను నేను చూస్తున్నాను.