తత్రాపశ్యత్ స్థితాన్ పార్థః పితౄనథ పితామహాన్ ।
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా ॥ 26
శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి ।
తత్ర, అపశ్యత్, స్థితాన్, పార్థః, పితౄన్, అథ, పితామహాన్,
ఆచార్యాన్, మాతులాన్, భ్రాతౄన్, పుత్రాన్, పౌత్రాన్, సఖీన్, తథా.
శ్వశురాన్, సుహృదః, చ, ఏవ, సేనయోః, ఉభయోః, అపి.
పార్థః = అర్జునుడు; తత్ర = అక్కడ; ఉభయోః = రెండు; సేనయోః అపి = సేనలలోను; స్థితాన్ = ఉన్న; పితౄన్ = పితృ సములను; అథ = మఱియు; పితామహాన్ = తాతలను; ఆచార్యాన్ = గురువులను; మాతులాన్ = మేనమామలను; భ్రాతౄన్ = సోదరులను; పుత్రాన్ = పుత్రులను; పౌత్రాన్ = మనుమలను; తథా = అలాగే; సఖీన్ = స్నేహితులను; శ్వశురాన్ = మామలను; సుహృదః చ ఏవ = మొదలైన ఆత్మీయులందరినీ; అపశ్యత్ = చూచెను.
తా ॥ అప్పుడు పార్థుడు రెండుసేనలలో ఉన్న భూరిశ్రవాది పితృసములను, భీష్ముడు మొదలుగాగల పితామహులను, ద్రోణుడు మున్నగు ఆచార్యులను, శల్యాదులైన మేనమామలను, దుర్యోధనాదులైన సోదరులను, లక్ష్మణాదులైన పుత్రస్థానీయులను, పౌత్రులను, అశ్వత్థామాది మిత్రగణాన్ని, కృతవర్మాదులైన ఆత్మీయులను చూచెను.